అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో ఆయిల్ ధరలలో అనూహ్య పెరుగుదల రావడంతో విమానయాన సంస్థలు ఫ్లైట్ టికెట్ ధరలను కొంతమేర పెంచాయి. అంతేకాకుండా నిర్వహనా భారం పేరిట కూడా ధరలపెంపును ప్రయాణికుల నెత్తిన వేస్తున్నాయి. దేశంలో తిరిగే విమానాలు టికెట్ ధరలను అమాంతం పెంచేయడంతో కేంద్రం చర్యలు తీసుకుంది. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ రేట్లపై పరిమితులు ఎత్తివేసేందుకు సిద్ధమైంది. 2025 డిసెంబర్‌లో విధించిన ఈ అధిక ధరలను తొలగించి కొత్త ధరలను రేపటి నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి మార్చి 23 వ తేదీనుంచి టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు టికెట్ ధరలు భారీగా తగ్గి అందుబాటులో ఉండేందుకు అవకాశం ఉంది.
ధరలను ఇస్తానురాజ్యంగా పెంచొద్దని ఎయిర్‌లైన్స్‌ను కేంద్రం హెచ్చరించింది. ఇలా ధరలను ఎప్పటికప్పుడు పెంచి వియానయాన సంస్థలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న క్రమంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం సమంజసమే.
రేపటి నుంచి ఫ్లైట్ టికెట్ ధరల్లో మార్పులు