ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్’ ఉక్కు కర్మాగారానికి మార్చి 23న భూమిపూజ చేయనున్నారు. సీఎం నారా చంద్రబాబు, కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష మందికి ఉపాధి లభించనుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా ఈ పరిశ్రమ పనిచేయనుంది. ఈ అతిపెద్ద ఉక్కు పరిశ్రమతో ఉత్తరాంధ్ర రూపురేఖలు
మారనున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ కలగనున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ పరిశ్రమ స్థాపనకు చాలా కసరత్తు చేశారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరింది.
ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్