బెంగుళూరును వీడుతున్న ఐటీ?


ఐటీ అంటేనే ఎన్నో పెట్టుబడులతో అభివృద్దిని తీసుకువచ్చే ఒక ప్ర‌త్యేక‌మైన రంగం. అందువలన ఎక్కువ రాష్ట్రాలు ఈ రంగంపై ఆసక్తి చూపిస్తాయి. ఐటీ కంపెనీల‌ను త‌మ రాష్ట్రాల‌కు ఆహ్వానించి అభివృద్ధి చెందేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. కానీ ఈ విషయంలో కొంత వ‌ర‌కు విజ‌యం సాధించిన కర్ణాటక ఇప్ప‌డు చాలా సవాళ్ల‌ను ఎదుర్కొంటోంది.

సిలికాన్ వ్యాలీగా పేరుతెచ్చుకున్న బెంగుళూరులో ఇప్ప‌డు ఐటీ సంస్థలు కార్యకలాపాలు సాగించడానికి ఆసక్తి చూపించడం లేదు. సరైన మౌలిక వసతులు లేకపోవడం, ట్రాఫిక్ మొదలైన సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఐటీ కంపెనీలకు సరైన వాతావరణం కనిపించడం లేదు. అందువల్ల బెంగుళూరు నుంచి హైదరాబాద్, వైజాగ్ కి ఈ కంపెనీలు వలస కడుతున్నాయి.
ఈ పరిస్థితి బెంగుళూరు కంపెనీలకు ఎందుకువచ్చింది…? దీనికి కారణం ఏమిటో ఓ సారి తెలుసుకుందాం.

భారతదేశపు సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు.. గూగుల్, ఆపిల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి దాదాపు అన్ని అగ్రశ్రేణి టెక్ దిగ్గజాల పరిశోధన, అభివృద్ధి (R&D), ప్రధాన కార్యకలాపాల కేంద్రాలకు నిలయంగా ఉంది. 12 కంటే ఎక్కువ ఐటీ పార్కులు బెంగుళూరులో అందుబాటులో ఉన్నాయని అంచనా. కానీ ఈ స్థాయిలో ఈ సెక్టార్‌ దూసుకుపోతున్న‌ప్ప‌టికీ ఎన్నో సవాళ్ళు (Why IT Companies Are Leaving Bangalore) ఎదుర్కోవలిసి వస్తుంది. 5 సంవత్సరాల నుంచి బెంగుళూరులో ఐటీ కంపెనీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు బెంగుళూరులో స్టార్టప్ పెట్టడానికి ఏ కంపెనీలు ముందుకు రావడం లేదు.

అనేక కార‌ణాలు..

  • సరైన మౌలిక వసతులు లోకపోవడం వల్ల‌ అంటే రోడ్లు పూర్తిగా పాడైపోయి చాలా చోట్ల గుంతలు పడ్డాయి.
  • తక్కువ దూరం ప్రయాణించాలన్నా కనీసం అరగంట ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది.
  • ఔటర్ రింగ్ రోడ్, సర్జాపూర్ రోడ్‌, ఎలక్ట్రానిక్ సిటీల్లో నిత్యం రద్దీగా ఉండడం, ఆ ప్రాంతాలలో ఎక్కువ ఐటీ కంపెనీలు ఉండడం, దీనివలన ఉద్యోగులకు చాలా సమయం ప్ర‌యాణానికే సరిపోతుంది.
  • గుంతలు ఎక్కువ ఉండడం వల్ల‌ చిన్న వర్షానికి కూడా రోడ్లమీద నీళ్లు ఉండిపోతున్నాయి.
  • కేఆర్ పురం మెట్రో నుంచి సిల్క్ రోడ్ స్ట్రెచ్ లో దాదాపు 500 ఐటీ సంస్థలు ఉంటాయి. ఈ కంపెనీల్లో సుమారు 9లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఈ ఏరియాలో రహదారులు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి.
  • ట్రాఫిక్ కారణంగా ప్రొడక్టివిటీపై ప్రభావం పడుతుంది. డ్రైనేజీ సమస్య కూడా ఎక్కువ ఉంది. తరచూ, కరెంట్ లేకపోవడం, నీటికొరత కూడా ఉంటుంది. ఈ సమస్యలు అన్నీ చూసి చాలా ఐటీ సంస్థలు బెంగుళూరు నుంచి వెళ్ళిపోవాలని భావిస్తున్నాయి. అందుకే 5 సంవత్సరాల్లో సుమారు 629 సంస్థలు బెంగుళూరు నుంచి వేరే రాష్ట్రాలకు మారినట్లు నివేదికలు చెబుతున్నాయి. పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేయకపోయినా (Why IT Companies Are Leaving Bangalore) వేరే చోట్ల అభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. బెంగుళూరులో ఆపరేషన్స్ పై ఆధారపడకుండా జాగ్రత్త పడుతున్నాయి.
  • బెంగుళూరులో ఆఫీస్ అద్దెలు విపరీతంగా పెరిగాయి. 5 సంవత్సరాలలో సుమారు 60 నుండి 80శాతం వరకు అద్దెలు పెరిగినట్లు అంచనా. హైదరాబాద్ లాంటి నగరాలతో పోల్చితే బెంగుళూరులో రెట్టింపు అద్దెలు. అయితే మిగతా సిటీల కంటే ఉద్యోగుల జీతాలు సైతం బెంగుళూరులో 30 శాతం ఎక్కువ.
  • బెంగుళూరును కాదనుకుంటున్న సంస్థలు వాటి గమ్యాన్ని హైదరాబాద్, విశాఖపట్నానికి మార్చుకుంటున్నాయి.

1990 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ లో ఐటీ రంగం మంచి వృద్దిని సాధించింది. ఇందుకు ప్రధానకారణం మౌలిక వసతులు బాగుండడమే. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉండడం వలన గ్లోబల్ నెట్ వర్క్ కూడా సుల‌భ‌త‌రమైంది. బెంగుళూరుతో పోల్చితే హైదరాబాద్ లో ఆఫీస్ అద్దెలు తక్కువ. విశాల‌మైన ఐటీపార్కులు కూడా ఉన్నాయి. అందువలన చాలా సంస్థలు హైదరాబాద్ కి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం ఈ మధ్య‌కాలంలో ఐటీ కంపెనీలను విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంది. ముఖ్యంగా A.I డేటా సెంటర్ హబ్ గా మారనుంది. ఇంటర్నేట్ కేబుల్ ద్వారా సింగపూర్, అమెరికా కి హైస్పీడ్ కనెక్ట్ నెట్ రావడం కలిసివచ్చే అంశాలు. A.P ప్రభుత్వం ఐటీ సంస్థలు రావడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. డేటా సెంట‌ర్‌ ఏర్పాటుకు గూగుల్ 15 మిలియన్ డాలర్ల మేర ఇక్కడ పెట్టుబడులు పెట్టనుంది.

హైదగాబాద్, విశాఖతో పాటు పుణె, చెన్నై, అహ్మదాబాద్, గుర్‌గావ్, నోయిడా, కొచ్చి, ఇండోర్, కోయంబత్తూర్లోనూ ఐటీ సంస్థలు పెరుగుతున్నాయి. అయితే ఈ రంగంలో కొత్త‌గా ఎదుగుతున్న కంపెనీలు బెంగుళూరు లాంటి ప‌రిస్థితి రాకుండా ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *