తెలంగాణ ఆర్టీసీ బ‌స్సు చార్జీలు త‌గ్గింపు

రాష్ట్రంలోని ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ శుభవార్త అందించింది. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల ఛార్జీలను తగ్గించింది. టికెట్ ధరల్లో మార్పులు చేయకుండా డిస్కౌంట్‌తో ఛార్జీలను తగ్గించారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల ఛార్జీలతో సమానంగా వీటిని నిర్ణయించారు. ఈ తగ్గింపును 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆదరణ లభిస్తే ఇదే ఛార్జీలను కొనసాగించనున్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద పురుషులకు సీట్లు పరిమితం కావడంతో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలు తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మ‌హిళ‌ల‌కు పూర్తి ఉచితంగా బ‌స్సు స‌ర్వీసుల‌ను అందిస్తున్న త‌ర్వాత పురుషుల‌కు బ‌స్సుల్లో ప్ర‌యాణం తీవ్ర ఇబ్బందిగా త‌యారైంది. స‌రైన స‌మ‌యానికి బ‌స్సులు లేకపోవ‌డం, ఉన్న బ‌స్సుల్లో ఖాళీగా లేక‌పోవ‌డంతో ప్ర‌యాణాలు చేయ‌లేపోతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో మ‌హిళ‌ల‌తో సీట్ల కోసం వాగ్వాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో పెద్ద బ‌స్సుల్లో పురుషుల‌కు ప్ర‌యాణ స‌దుపాయానికి వెసులుబాటు క‌ల్పించే దిశ‌గా టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకుంది ప్ర‌భుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *