సౌరకాంతులను ఆదాయ మార్గాలుగా మలిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. థర్మల్ విద్యుత్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ పర్యావరణ హితమైన సౌరశక్తి ద్వారా గృహ వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కుసుం పథకాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో సార్ విద్యుత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రైతులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో అతి తక్కువ ఖర్చుతో ప్లాంట్ల ఏర్పాటుకు సమాయత్తం అవుతోంది.
విధి విధానాలు
విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ ఉద్గా సురక్ష ఏవం ఉత్తాన మహాభియాన్ , పీఎం కుసుం పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కుసుం పథకం సద్వినియోగం చేసుకుని అందులో రైతులను మహిళలను భాగస్వామ్యం చేసి సోలార్ పవర్ ప్లాంట్లు (Install a solar plant for free) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగులో లేని , వ్యవసాయ యోగ్యం కాని బీడు భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యక్తులు, సంస్థల్ని ప్రోత్సహిస్తోంది. పీఎం కుసుం పథకం వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తోంది. సౌర శక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతులు, అర్హత గల లబ్దిదారులకు ప్రయోజనం అందించేందుకు గాను పీఎం కుసుం పథకానికి విస్తృత ప్రచారం కల్పిస్తోంది.
what is PM Kusum Scheme
పీఎం కుసుం పథకం ప్రధాన లక్ష్యం పొలాల్లో సౌరశక్తిని ఉత్పత్తి చేసి రైతులకు ఆదాయాన్ని అందించడం. 33/11 kv సబ్ స్టేషన్ కు 5 km పరిధిలో ఉన్న భూముల్లో 500 kw నుంచి 2 మెగావాట్ల వరకు ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, స్వయం సహాయక బృందాలు, గ్రామ సంస్థలు, మండల సమాఖ్యలు పథకానికి అర్హులు. రైతులు వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి పొలాల్లో 500 kw నుంచి రెండు మెగావాట్ల సామర్థ్యం (Install a solar plant for free) కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థిక స్తోమత లేకుంటే డెవలపర్లకు భూములను లీజుకు ఇచ్చి ప్లాంట్ పెట్టించుకునే వెసులుబాటు ఉంది. లీజుకు ఇస్తే లీజు డబ్బును డిస్కౌంట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక మెగా వాటు సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మూడున్నర ఎకరాల నుంచి నాలుగు ఎకరాల స్థలం అవసరం. ఉత్పత్తి చేసే విద్యుత్తును విద్యుత్ పంపిణీ సంస్థలు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసేలా ప్రభుత్వం భరోసాని ఇస్తుంది. అయితే సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక మెగావాట్ కు రూ.2.97 కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో లబ్ధిదార 10% వాటా అంటే 20 9.7 లక్షల రూపాయలు భరిస్తే మిగిలిన 90% అయిన 2.61 కోట్లను బ్యాంకులు రుణంగా అందజేస్తాయి. ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎస్ హెచ్ జి లకు అటవీ దేవాదాయ భూములను లీజుకు ఇవ్వాలని భావిస్తుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్చ్ ఆధ్వర్యంలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఎస్ హెచ్ జి లను ఎంపిక చేసి వారితో సౌర విద్యుత్ ప్లాంట్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
బ్యాంకు రుణాలు
పీఎం కుసుం పథకం కింద ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే రైతులకు కూడా బ్యాంకులు రుణాలు అందిస్తాయి. మొత్తం పెట్టుబడిలో రైతులు 30% భరించగలిగితే మిగిలిన 70% మూలధనం బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ప్లాంట్ల ఏర్పాటుకు 6% వడ్డీకే రెండు కోట్ల వరకు రుణం ఇచ్చేందుకు sbi ముందుకు వచ్చింది. రెండు కోట్లకు మించిన రుణానికి 9% వడ్డీ వసూలు చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ ఆర్ సి నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్ 313 చొప్పున రైతులు ఎస్‌హెచ్‌జీ లకు డిస్కమ్‌లు చెల్లిస్తాయి. భవిష్యత్తులో ఈ ఆర్ సి నిర్ణయం మేరకు ధరల్లో మార్పులు ఉండొచ్చు. ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్లాంట్ లో నెలకు ₹130000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో నెలకు దాదాపు ₹425000 వరకు రైతులకు ఆదాయం సమకూరనుంది. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సగటున 15 నుంచి 16 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి (Install a solar plant for free) అవుతుంది. పొలంలో పంటలు వేయంగా మిగిలిన భూమిలో సోలార్ ను ఏర్పాటు చేసుకుంటే మీకు పంటతో పాటు సోలార్ నుంచి కూడా ఆదాయం వస్తుంది. దరఖాస్తు దారులు వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ప్లాంట్ పెట్టుకునే వారికి ప్రాధాన్యం
ప్లాంట్ నుంచి సబ్ స్టేషన్ వరకు వ్యవస్థాపకులే ప్రత్యేక విద్యుత్ సరఫరా లైన్ వేసుకోవాలి. సబ్ స్టేషన్ కు 5 km పరిధి లోపల ప్లాంట్ పెట్టుకునే వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఒక సబ్ స్టేషన్ పరిధిలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్లాంట్లు ఏర్పాటు చేస్తే అందరూ కలిసి ఒకే సరఫరా లైన్ వేసుకోవచ్చు. కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్ కు 40 పైసల చొప్పున ఐదేళ్ల పాటు డిస్కమ్ లకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ప్రోత్సాహకంగా అందిస్తుంది. మెగావాట్ కు మొత్తం 66 లక్షలకు మించకుండా ఈ ప్రోత్సాహం ఉంటుంది. ఇలా సౌర విద్యుత్ ఉత్పత్తికి అన్ని వైపులా ప్రోత్సాహం అందిస్తూ.. విద్యుత్ కొరతను తీర్చడంతో పాటు రైతుల ఆదాయం పెంచాలని ప్రభుత్వ యోచన. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని కూడా లక్ష్యంగా నిర్దేశించుకుంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పీఎం కుసుం పథకానికి రుణాలు ఇస్తున్నాయి. దీంట్లో రైతులు 30% పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 70% రుణాన్ని బ్యాంకులు అందిస్తాయి.
కుసుం యోజన ప్రయోజనాలు
ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా అదనంగా ఉత్పత్తి చేసే పవర్‌ను రైతులు నేరుగా ప్రభుత్వానికి అమ్మి, ఆదాయాన్ని పొందొచ్చు. సోలార్ పవర్ ప్లాంట్లు మాత్రమే కాక ప్రభుత్వం డీజిల్ పంపుల స్థానంలో సరికొత్త సోలార్ పంపులను ఏర్పాటు చేస్తోంది. సోలార్ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. కొత్త సోలార్ పంపులు ఏర్పాటు చేసేందుకు, పాత వాటిని మెరుగుపరిచేందుకు ప్రతి రైతుకి భారీ మొత్తంలో రాయితీ ఇస్తారు. మొత్తం సోలార్ పంపు ఏర్పాటులో అర్హులైన రైతులకు 60 శాతం సబ్సిడీ ని ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 30 శాతాన్ని బ్యాంకుల ద్వారా పొందొచ్చు. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా డిస్కమ్‌లు ఆర్థికంగా మెరుగుపడనున్నాయి.
ఎవరు అర్హులు
భారతీయ పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారులు తమ ల్యాండ్‌లో 2 మెగా వాట్ కెపాసిటీ వరకు అప్లయి చేసుకోవచ్చు. 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ కెపాసిటీ వరకు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కచ్చితంగా రైతు అయి ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. పాన్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయపు ధ్రువీకరణ పత్రం, మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్, పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
కుసుమ్ యోజనకు చెందిన అధికారిక వెబ్‌సైట్ https://mnre.gov.in/కి వెళ్లాలి. ఆ తర్వాత మీ ముందు ఉన్న హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫామ్‌లో మీ పేరు, అడ్రస్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటి సమాచారమంతా నింపాలి. సమాచారం నింపిన తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కాలి. ఇలా తేలికగా పీఎం కుసుమ్ యోజనకు దరఖాస్తు చేసుకుని మీ ల్యాండ్‌లోనే సోలార్ పంపు ఏర్పాటు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఈ హెల్ప్‌లైన్ నెంబర్లు 011-24360404, 011 – 24360707, టోల్‌ఫ్రీ నెంబర్ – 1800 180 3333 ఫోన్ చేయొచ్చు. అధికారిక వెబ్‌సైట్ www.mnre.gov.inని సంప్రదించవచ్చు.