తెలుగు సినిమా రాష్ట్రాలు దాటింది. అన్ని భాషల్లోనూ అలరిస్తోంది. ఇక్కడి నటులు కూడా దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగులో సూపర్ క్రేజీ నటుడైన జూ.ఎన్టీఆర్ డెరెక్ట్‌గా హిందీలో లాంచ్ అయ్యాడు. వార్2
తో బాలీవుడ్లో ఆరంగ్రేటం చేశాడు. పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అందగాడైన హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడనగానే బాలీవుడ్ పరిశ్రమ అంతా ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. బాడీ షేమింగ్ కూడా మొదలుపెట్టింది. ఎన్టీఆర్‌ని డీ గ్రేడ్ చేసే ప్రయత్నం చేసింది. దీన్ని ఎన్టీఆర్ అభిమానులు దీటుగానే తిప్పి కొట్టారు.
ఈ క్రమంలో మోస్ట్ ఎవైటెనింగ్ మూవీగా విడుదలైన వార్2
( war2 movie review telugu), రజినీకాంత్ కూలీ
సినిమానే నేరుగా ఢీకొట్టింది. అందుకు తగ్గట్టుగానే తెలుగు, హిందీ అభిమానులను ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. హీరోల ఎంట్రీ, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్.. ఇలా సినిమా అంతా అలరించింది. కొన్ని కొన్ని సన్నివేశాలలో ఎన్టీఆర్‌ను నెగెటివ్‌గా చూపించినా, తక్కువ చేసినట్టు అనిపించినా, చివరికి ఇద్దరి హీరోలను సమానంగా బ్యాలెన్స్ చేసి ముగించారు.
యాక్షన్ సన్నివేషాలు, డ్యాన్స్‌లు అదరగొట్టారు. భారీ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ ఇంకా బాగా చేయవచ్చు అనిపించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ( war2 movie review telugu) కొన్ని సార్లు చాలా పీలగా, బలహీనంగా, కొంచెం అందవిహీనంగా కనిపించాడు. ఇలాంటి మూవీలో ఎన్టీఆర్‌ను ఇంకా బాగా చూపించాల్సి ఉన్నప్పటికీ ఎందుకో శ్రద్ధ పెట్టినట్టు కనిపించలేదు.
సినిమాలోని కార్ చేజింగ్ సీన్ చాలా ఉత్కంఠకు గురిచేసింది. సినిమాకే ఇది హైలెట్ అని చెప్పవచ్చు. ప్రొడక్షన్ పరంగా వార్2 చాలా రిచ్‌గానే ఉంది. ఎన్టీఆర్‌కు హీరోఇన్ లేకపోవడం, డ్యూయెట్ లేకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. హృతిక్ రోషన్ అన్ని సినిమాల్లో లాగానే ఇక్కడ కూడా అదే స్థాయి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అవే డాన్స్ స్టెప్పులు.. అదే కటౌట్. యాక్షన్ ప్రేమికులకు ఓకే.
మిగిలిన నటులంతా తమ స్థాయికి తగ్గట్టుగా బానే చేశారు. మరో తెలుగు ముఖం కనపడకుండా, ఇదంతా పూర్తి బాలీవుడ్ సినిమాలాగానే తెరకెక్కించారు.